#popad code #popad code
Singer | Kaala Bhairava |
Composer | M M Keeravaani |
Music | M M Keeravaani |
Song Writer | Sudhala Ashok Teja |
భీమా నిను కన్న నేల తల్లి
ఊపిరి పోసిన చెట్టు చేమ
పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతూర్రా
వినబడుతోందా
కొమురం భీముడొ
కొమురం భీముడొ
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో
కొమురం భీముడొ
కొమురం భీముడొ
రగారాగా సూర్యుడై రగలాలి కొడుకో
రగలాలి కొడుకో
కాళ్లు మోక్త బాంచెన్ అని
వొంగి తొగలా
కారడవి తల్లికి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో
జులుము గద్దెకు తలను
వొంచి తూగాల
దుడుము తల్లి పేగుల పెరగానట్టేరో
పెరగానట్టేరో
కొమురం భీముడొ
కొమురం భీముడొ
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో
చర్మమొలిచె దెబ్బకు
ఒప్పంటు ఊగాలా
చిమికే రక్తము చూసి
చెదిరి తోగాల
గుబులేసి కన్నీరు వొలికి తోగాల
భూతల్లి చనుపాలు తాగనట్టేరో
తాగనట్టేరో
కొమురం భీముడొ
కొమురం భీముడొ
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో
మండాలి కొడుకో
కాలువై పారె నీ గుండె నెత్తురు
కాలువై పారె నీ గుండె నెత్తురు
నేలమ్మా నుదిటి బొట్టైతుంది చూడు
అమ్మ కాళ్ళ పారానైతుంది చూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు
కొమురం భీముడొ
కొమురం భీముడొ
పుడమి తల్లికి జన్మ మరణమిస్తివిరో
కొమురం భీముడొ
0 Comments