#popad code #popad code మన సొంతిల్లు కళ

Ad Code

Responsive Advertisement

మన సొంతిల్లు కళ

మన సొంతిల్లు కళ






 సరుకులన్నీ కట్టించుకున్నాక కౌడ్ డబ్బు చెల్లించి చెప్పాడు.

“నేను మళ్లీ వచ్చి తీసుకుంటాను. చిన్న పని మీద వెళ్తున్నాను.”
“అలాగే కమాండర్. కాని మర్చిపోకండి.” షాప్ యజమాని అంగీకరించాడు.
సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆఫీస్‌లోకి వెళ్లే కమాండర్ని చూసిన 8 ఏళ్ల జేమ్స్ అడిగాడు.
“ఇవాళ నా ఎనిమిదో పుట్టినరోజు. నీకు చాక్లెట్స్ ఇచ్చి నీ ఆశీర్వచనాలు తీసుకోడానికి వచ్చాను.”
“ఓ! ఐతే చర్చ్‌కి వెళ్లు. నా ఆశీర్వచనాలు కాదు. నీకు ప్రీస్ట్ ఆశీర్వచనాలు కావాలి.” క్లౌడ్ చెప్పాడు.
బ్రైట్ రియాల్టీ కంపెనీలోకి వచ్చిన నలభై ఏళ్ల కమాండర్‌ని బ్రైట్ ఆనందంగా ఆహ్వానిస్తూ అడిగాడు.
“హలో కమాండర్. మీకేం సహాయం చేయగలను?”
బయట ఇల్లు అమ్మకానికి ఉందన్న బోర్డ్ చూసి వచ్చాను.”
“ఓ విలియమ్స్ ఇల్లు అది. అది అమ్మకానికి రాగానే మీరే గుర్తుకు వచ్చారు. మీకది తప్పక నచ్చుతుంది.” బ్రైట్ దాని ఫొటోని ఇచ్చి చెప్పాడు.
“చిన్నది. తెల్ల రంగులో ఉంది. నాకు తెలుపు ఇష్టం…వెనకాల కూడా తోట ఉందనుకుంటాను?” అతను ఇంటి ముందున్న గులాబీ చెట్టుని చూసి అడిగాడు.
“ఉంది. మిసెస్ విలియమ్స్‌కి తోటంటే ఇష్టం.”బ్రైట్ చెప్పాడు.
“ఎంత చెప్తున్నారు?”
“తొంభై ఐదు వేల డాలర్లు.”
“డౌన్ పేమెంట్ ఎంత?”
“పదివేల డాలర్లు.”
కమాండర్ మొహంలోని విచారాన్ని గమనించి బ్రైట్ చెప్పాడు...
“ఐదు వేలేమో? ఆ ఫైల్ చూసి చెప్తాను.”
అతను సైగ చేస్తే అతని అసిస్టెంట్ ఆ కొత్త ఇంటి ఫైల్‌ని రేక్‌లోంచి తీసిచ్చింది.
“వెయ్యి డాలర్లే. సారీ. తప్పు చెప్పాను. కొత్తగా పెయింట్ చేసారు కూడా.”
అసిస్టెంట్ అతని వంక ఆశ్చర్యంగా చూసింది....
“వెయ్యా? చాలా తక్కువ.”
“మీరా డబ్బు ఏర్పాటు చేసుకుని రండి.”
“అంతదాకా ఎవరికీ అమ్మకండి. ఈ ఫొటో తీసుకోవచ్చా?” కమాండర్ అర్ధించాడు.
బ్రైట్ తీసుకోవచ్చన్నట్లుగా తలూపితే దాంతో అతను హుషారుగా బయటకి నడిచాడు.
“మీరు పొరబడ్డారు. ఆ ఇంటికి డౌన్ పేమెంట్ పన్నెండు వేల డాలర్లు కదా మిస్టర్ బ్రైట్?” అసిస్టెంట్ అడిగింది....
“అది నాకు తెలుసు.”
“మరి తక్కువ చెప్పారే?”
“ఓ! నువ్విక్కడ కొత్త కదా? అతను కమాండర్ క్లౌడ్ లెబౌ. అతను యుద్ధంలో పి.టి బోట్‌లో కమాండర్‌గా పనిచేసాడు. మైన్ తాకి అతని పడవ పేలిపోయింది. తలకి బలమైన దెబ్బ తగలడంతో అతనికి చిత్తచాంచల్యం వచ్చింది. అక్క, బావ, తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. ఓ ఇల్లు కొని అందులో ఒంటరిగా ఉండాలన్నది అతని కల. అది ఎప్పటికీ నెరవేరక పోవచ్చు. అతను వెయ్యి డాలర్లు తీసుకురాలేడు.”
పచారీ దుకాణం ముందు నించి క్లౌడ్ వెళ్తూంటే దాని యజమాని పక్కనే ఉన్న సంచీని అతని చేతికి ఇస్తూ చెప్పాడు.....
“దీన్ని మర్చిపోయారు.”
“ఓ! థాంక్స్.”
అతను ఇంటికి చేరుకున్నాడు. అతని బావ హెన్రీ అక్క అగాథాతో తమ్ముడు ఫ్రేంక్ పెళ్లి గురించి మాట్లాడటం విన్నాడు.
“పెళ్లయ్యాక వాడ్ని ఆ ఇంటికి పంపడమంటే బానిసత్వంలోకి పంపడమే.” హెన్రీ చెప్పాడు...

“అది ఆత్మరక్షణకి. అతను నా కోసం రివాల్వర్‌తో అక్కడ దాక్కుని ఉన్నాడు. కారు దిగగానే కనిపించాడు. అతను చేతిలో రివాల్వర్‌తో నా వైపు వస్తూంటే, కార్ డేష్ బోర్డ్ లోంచి నా రివాల్వర్‌ని తీసి వాడ్ని కాల్చాను. ఏం చేస్తున్నానో తెలీకుండా కాల్చాను.”

బానిసత్వంలోకి కాదు. వైవాహిక జీవితంలోకి. వాళ్లకి బాగా డబ్బుందన్న సంగతి మర్చిపోకు.”
“నేనో మంచి ఇంటిని చూసాను. వెయ్యి డాలర్లు డౌన్ పేమెంట్. అది ఇస్తావా?” క్లౌడ్ తన బావని అడిగాడు....
“సరుకుని వంటగదిలోకి తీసుకెళ్లు క్లౌడ్.” అక్క అగాథా కోపంగా చెప్పింది.
“అది చాలా చవక. నాకు నచ్చింది. నా పెన్షన్ చెక్‌లోంచి ఆ డబ్బు ఇవ్వు బావా.” క్లౌడ్ మళ్లీ అడిగాడు......
“మన తమ్ముడు ఫ్రేంక్‌కి ఓ గొప్ప ఇంటి అమ్మాయితో పెళ్లి జరగబోతోంది. ఈ పెద్ద ఇంటిని చూసే పెళ్లికూతురు తండ్రి ఫ్రేంక్‌కి తన కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఫ్రేంక్ పెళ్లయ్యేదాకా డాలర్ కూడా ఇవ్వలేను. అర్థం చేసుకో. ఇది మన మొత్తం కుటుంబానికి ముఖ్యం ఆమె చెప్పింది.
తన గదిలోకి వెళ్లిన క్లౌడ్ ఆ ఇంటి ఫొటోని చెక్క గోడకి పిన్‌తో గుచ్చాడు. బ్రైట్ కంపెనీ నించి తెచ్చిన అలాంటి మరికొన్ని ఫొటోలు ఆ గోడకి ఉన్నాయి.
౦౦౦
అర్ధరాత్రైనా ఇంకా ఫ్రేంక్ ఇంటికి తిరిగి రాలేదని అగాథా, హెన్రీ ముందు గదిలో కూర్చుని ఎదురు చూస్తున్నారు.
“ఫ్రేంక్ ఎక్కడో తాగి మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడేమోనని నాకు భయంగా ఉంది. పెళ్లయ్యే దాకా నైనా వాడ్ని జాగ్రత్తగా ఉండమన్నా వినడాయె.” అగాథా బాధగా చెప్పింది.
“అంతే కాని నీ బాధ వాడి క్షేమం గురించి కాదన్నమాట.” హెన్రీ అడిగాడు.
అకస్మాత్తుగా బయట సడన్ బ్రేక్‌తో కారు ఆగిన శబ్దం వినిపించడంతో అగాథా చెప్పింది.
“వాడు తప్పతాగి వచ్చినట్లున్నాడు.”
“లోపలకి వచ్చారాగానే వాడి మీద పడక.” హెన్రీ తన భార్యకి సలహా ఇచ్చాడు.
“పెళ్లయ్యే దాకా ఎవరో ఒకరు వాడిని అదుపులో పెట్టాలి.” ఆమె కోపంగా చెప్పింది.
అకస్మాత్తుగా బయట నించి రావాల్వర్ పేలిన శబ్దం వినిపించింది. ఓ నిమిషం తర్వాత తలుపు తెరచుకుని లోపలకి వచ్చిన ఫ్రేంక్‌ని హెన్రీ అడిగాడు.
“ఏం జరిగింది?”
“నేనో మనిషిని కాల్చాను.” ఇరవై ఎనిమిదేళ్ల ఫ్రేంక్ భయంగా చెప్పాడు.
క్లౌడ్ కిందకి వచ్చాడు. హెన్రీ వెంటనే బయటకి వెళ్లి మళ్లీ వచ్చి అడిగాడు.
“ఎవరతను?”
“నాకు తెలీదు.”
“పోయాడా?” అగాథా ఆందోళనగా అడిగింది.
“అవును. మన కార్ షెడ్‌లో. వాడు దొంగైతే నీకు వాడ్ని కాల్చే హక్కుంది. వెంటనే పోలీసులకి కబురు చేస్తాను. మనింట్లోకి అతను చొరబడటం తప్పు.” హెన్రీ చెప్పాడు.
“అదంత తేలిక సమస్య కాదు.” ఫ్రేంక్ బలహీనంగా చెప్పాడు.
“ఏమిటి నువ్వు అనేది?” అగాథా కోపంగా అరిచింది.
“తమ్ముడి మీద అరవకక్కా. వాడు ఇంకాస్త భయపడతాడు.” క్లౌడ్ అక్కకి అడ్డుపడ్డాడు.
“ఏం జరిగిందో చెప్పు ఫ్రేంక్.” హెన్రీ అడిగాడు.
“అది ఆత్మరక్షణకి. అతను నా కోసం రివాల్వర్‌తో అక్కడ దాక్కుని ఉన్నాడు. కారు దిగగానే కనిపించాడు. అతను చేతిలో రివాల్వర్‌తో నా వైపు వస్తూంటే, కార్ డేష్ బోర్డ్ లోంచి నా రివాల్వర్‌ని తీసి వాడ్ని కాల్చాను. ఏం చేస్తున్నానో తెలీకుండా కాల్చాను.” ఫ్రేంక్ నిస్పృహగా చెప్పాడు.
“నీది పాత కారే. దాని గురించి బాధపడకు ఫ్రేంక్. రేపీపాటికల్లా కొత్త కారు కొనుక్కుందాం.” క్లౌడ్ ఫ్రేంక్ దగ్గరికి వెళ్లి భుజం మీద తట్టి చెప్పాడు.
“క్లౌడ్. నువ్వెళ్లి పడుకో. రేపు మాట్లాడుదాం.” అగాథా పెద్ద తమ్ముడి మీద అరిచింది.
క్లౌడ్ తల ఊపి తన గదిలోకి వెళ్లిపోయాడు.
“చెప్పు ఫ్రేంక్. నిజం చెప్పు. ఆ వ్యక్తి అక్కడ నీకోసం రివాల్వర్‌తో ఎందుకు ఎదురు చూస్తున్నాడు?” హెన్రీ అడిగాడు.
“అతనికి నేను కొంత సొమ్ము బాకీ పడ్డాను.”
“కాని ఇందాక అతను నీకు తెలీదని చెప్పావు?” అగాథా చురుగ్గా చూస్తూ అడిగింది.
“నిజంగా తెలీదు. ఇందాక నేను పేకాట ఆడేప్పుడు పరిచయం. అతను చాలా గెలుచుకోవడంతో ఎక్కువ పందెంతో గెలిచి తీరుద్దామని ఆడి ఓడిపోయాను. అంతకు మునుపు పరిచయం లేదు. అతను మొదటిసారి ఆ పేకాట క్లబ్‌కి వచ్చాడు. అతన్ని ఆటలో గెలవలేకపోయాను. నాకన్నా తెలివిగా ఆడాడు. నేను పారిపోయాను. కాని ఈ ఇల్లు ఎలా కనుక్కున్నాడో నాకు తెలీదు.”
“ఆత్మరక్షణకి చంపావని పోలీసులకి చెప్పచ్చు.” హెన్రీ సూచించాడు.
“కాని వాడి పెళ్లి ఆగిపోతుంది. ఆ కేస్ కోర్ట్‌కి వెళ్లి వాడు బోనులో ముద్దాయిగా నిలబడితే ఇక పెళ్లి జరగదు.” అగాథా కంగారుగా చెప్పింది.
“మరింకేం చేయగలం?” హెన్రీ అడిగాడు.
“ఒకటుంది…ఫ్రేంక్! నీతో పేకాట ఆడిన వాళ్లల్లో ఎవరికైనా నువ్వు చంపిన వ్యక్తి ఎవరో తెలుసా?” అగాథా అడిగింది.
“నాకు తెలీదు. వాళ్లకి కూడా అతను పరిచయం ఉన్నట్లుగా కనపడలేదు.” అతను జవాబు చెప్పాడు.
“ఏమిటి నీ పథకం?” హెన్రీ అడిగాడు.
“శవాన్ని మాయం చేద్దాం.”
“అది కుదరని పని. అది బయటపడితే ఫ్రేంకే కాక మనమంతా కూడా ఇరుక్కుంటాం. ఫ్రేంక్ పోలీసులకి లొంగిపోవడమే మంచిది.”
“కాని ఫ్రేంక్ పెళ్లి ఆగకూడదు. అది నా నిర్ణయం. లేదా అవమానం.” అగాథా అరిచింది.
అగాథా పైకి వెళ్తూంటే హెన్రీ ఆమెని అనుసరించాడు. ఆమె క్లౌడ్ గదిలోకి వెళ్లి అతన్ని అడిగింది.
“నువ్వు మన కుటుంబ సభ్యులంటే ఎంతో ప్రేమగా దయగా ఉంటావు. అవునా?”
“అవును.”
“ఫ్రేంక్ ఇబ్బందిలో పడ్డాడని తెలుసా?”
“తెలుసు. వాడి కారు పాడైంది.”
“కాదు. ఓ మనిషిని చంపాడు.

క్లౌడ్ ఓ గులాబీ
మొక్కకున్న ఎండిన కొమ్మలని కట్ చేస్తూంటే జేమ్స్ వచ్చి అడిగాడు.
“ఇవాళ నా తొమ్మిదో పుట్టినరోజు. నీకు చాక్లెట్స్ ఇచ్చి నీ ఆశీర్వచనాలు తీసుకోడానికి
వచ్చాను.’

పోలీసులకి అది తెలిస్తే వాళ్లకి చాలా కోపం వస్తుంది. నువ్వు యుద్ధంలో ఇలాంటి రివాల్వర్‌తో చాలామందిని చంపావు కదా?”
“అవును. యుద్ధంలో సైనికుడి బెస్ట్ ఫ్రెండ్ రివాల్వర్. ఎంత నిద్రొస్తున్నా రాత్రి దాన్ని ఆయిలింగ్‌తో శుభ్రం చేసి, తుడిచి సిద్ధంగా ఉంచాలి. రేపు దాని అవసరం రావచ్చు.”
“ఫ్రేంక్ జీవితం నీ చేతుల్లో ఉంది. వాడు ఒకడ్ని చంపాడు.”
“కాని వాడికి రివాల్వర్ల గురించి తెలీదుగా?” క్లౌడ్ అయోమయంగా చూస్తూ అడిగాడు.
“నీకు తెలుసు. నువ్వు ఆఫీసర్‌వి. తమ్ముడికి నువ్వు సహాయం చేయాలి.”
“అగాథా!” హెన్రీ బాధగా అరిచాడు.
“పోలీసులు నీ మీద కోపం తెచ్చుకోరు. ఈ సహాయం చేయవా క్లౌడ్?” బతిమాలుతూ అగాథా అర్ధించింది.
“నేను యుద్ధంలో చాలా మందిని చంపాను. చాలా మందిని….” చెప్పి క్లౌడ్ రివాల్వర్ అందుకుని ఫోన్ దగ్గరికి నడిచాడు. ఓ నంబర్ తిప్పి చెప్పాడు.
“నా పేరు క్లౌడ్ లెబౌ. నా కోసం ఎవర్నైనా పంపండి. ఇప్పుడే నేనో మనిషిని చంపాను.” చెప్పి రిసీవర్ పెట్టేసాడు.
“ఇది పిచ్చి పని. చంపింది ఫ్రేంక్.” హెన్రీ అరిచాడు.
“కాని వాడు నా తమ్ముడు. వాడిని కాపాడాల్సిన బాధ్యత నాది. స్కూల్లో ఎవరైనా వాడ్ని కొడితే నేను కాపాడేవాడిని.” క్లౌడ్ చెప్పాడు.
“అది చిన్నప్పటి మాట.”
“ఫ్రేంక్ నాకు అప్పుడూ తమ్ముడే. ఇప్పుడే తమ్ముడే. కాలంతో మా బాంధవ్యం మారలేదు.” క్లౌడ్ చెప్పాడు.
“ఇదేమైనా బావుందా అగాథా?”
“హెన్రీ. క్లౌడ్‌ని ఉరి తీయరు. శానిటోరియంలో ఉంచుతారు. అక్కడ తోటలు, పువ్వులు…క్లౌడ్‌కి అవి ఇష్టం.” ఆమె చెప్పింది.
డోర్ బెల్ మోగింది. క్లౌడ్ నిర్భయంగా తలుపు తెరిచాడు.
“బాడీ ఎక్కడుంది?” వాళ్లు క్లౌడ్‌ని అడిగితే జవాబు చెప్పలేకపోయాడు.
“కార్ షెడ్‌లో. ఆత్మరక్షణకి అని చెప్పు క్లౌడ్.” అగాథా సూచించింది.
శవాన్ని చూసి వాళ్లు క్లౌడ్‌ని తమ వెంట తీసుకెళ్లారు.
౦౦౦
క్లౌడ్ ఓ గులాబీ మొక్కకున్న ఎండిన కొమ్మలని కట్ చేస్తూంటే జేమ్స్ వచ్చి అడిగాడు.
“ఇవాళ నా తొమ్మిదో పుట్టినరోజు. నీకు చాక్లెట్స్ ఇచ్చి నీ ఆశీర్వచనాలు తీసుకోడానికి వచ్చాను.”
“ఓ! ఐతే చర్చ్‌కి వెళ్లు. నా ఆశీర్వచనాలు కాదు. నీకు ప్రీస్ట్ ఆశీర్వచనాలు కావాలి.” క్లౌడ్ చెప్పాడు.
“నువ్వు ఓ రౌడీని కాల్చి చంపావుట కదా? అది నిజమా?”
“ఒకటి మర్చిపోకు. ఓ మనిషిని చంపడం మంచి పని కాదు. వాడు రౌడీ ఐనా కాకపోయినా. అది గుర్తుంచుకో. నేను చంపింది నా కుటుంబం కోసం. మన కుటుంబ సభ్యులని మనం ప్రేమించాలి. తమ్ముళ్లని రక్షించాలి. ఆ రౌడీ ఓ పోలీస్ ఆఫీసర్ని చంపడంతో ఎఫ్.బి.ఐ అతని కోసం వెదుకుతోంది. అంతే కాదు. ఓ బేంక్ అతని ఆచూకి చెప్పిన వారికి ఏభై వేల డాలర్లని కూడా ప్రకటించింది. నా కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లు ఏ కుటుంబానికీ ఉండరు. ఆ బహుమతి నాకు రావాలని వాళ్లు నేనే చంపానని చెప్పారు.”
“ఎందుకలా?” జేమ్స్ అడిగాడు.
“నాకు సొంతిల్లు కావాలని ఎంతగా ముచ్చట పడుతున్నానో వాళ్లకి తెలుసు. అందుకే.” చెప్పి క్లౌడ్ ఆ తోటలోంచి తను ఆ రోజు ఫొటోలో చూసిన ఇంట్లోకి- తన స్వంత ఇంట్లోకి నడిచాడు.

crime story telugu kathalu

                                                                                                 మల్లాది వెంకట కృష్ణమూర్తి

 (డొనాల్డ్ హగ్ కథకి స్వేచ్ఛానువాదం)

THIS STORY CREDITS goes TO (డొనాల్డ్ హగ్ కథకి స్వేచ్ఛానువాదం) 

Post a Comment

0 Comments

Close Menu
#copy peste code #copy peste code