#popad code #popad code నిజం నిప్పులాంటిది అది ఎలాంటి వారినైనా ధహించి వేస్తుంది

Ad Code

Responsive Advertisement

నిజం నిప్పులాంటిది అది ఎలాంటి వారినైనా ధహించి వేస్తుంది

 నిజం నిప్పులాంటిది

ఐనాక్స్ థియేటర్ లో ఫస్ట్ షో వదిలారు.అది కొత్త సినిమా కావడంతో హాలు నిండుగా ఉంది. జనం ఒక్కసారిగా లేవడంతో బి బ్లాక్ లోని నలుగురు కుటుంబ సభ్యులు జనం వెళ్లడం కోసం ఆగారు. ఐదు నిమిషాలు తర్వాత ఆ నలుగురు కదిలారు. ఆ సభ్యుల్లోని 20 ఏళ్ల అమ్మాయి ఒక సీటులో సెల్ కనిపించడంతో అనాలోచితంగా చేతిలోకి తీసుకొని చుట్టూ చూసింది. అప్పటికే చాలామంది ఎగ్జిట్ నుండి బయటకు వెళ్లిపోయారు. సెల్ మర్చిపోయిన వారిని గుర్తుపట్టడం అసాధ్యమని గుర్తించింది. కానీ సిబ్బంది ఎవరు ఆమెకు కనబడలేదు.

అది స్మార్ట్ ఫోన్ కాబట్టి తను ఓపెన్ చేయ్యలేదని, ఎవరైనా చేసినప్పుడు విషయం చెప్పి సెల్ ఇచ్చేయవచ్చును దాన్ని తన బ్యాగ్ లో వస్తుంది.

         కారులో ఇంటికొస్తున్నప్పుడు సెల్ దొరికిన విషయం తండ్రికి చెప్పింది.

 "మనకెందుకమ్మ న్యూసెన్స్, సెల్ అక్కడే వదిలేయాల్సింది" అన్నాడతను.

"ఖరీదైన లేటెస్ట్ మోడల్ సెల్ నాన్నా!

          చూస్తూ చూస్తూ వదిలేయలేకపోయను. సెకండ్ షో కి వచ్చిన ఎవరైనా చూసుకోకుండా కూర్చుంటే సెల్ పాడవుతుంది."

        "సర్లే.... ఊళ్ళో సమస్యలన్నీ మనవే అంటావు."ప్రేమగా కొపడ్డడు తండ్రి.

         ఇంటికి వచ్చిన అరగంటకి సెల్ మోగింది.

        "హలో...." కాల్ రిసీవ్ చేసుకుందా అమ్మాయి.

        "మీరెవరు?" అటునుంచి అడిగింది మగ గొంతు.

        "కాంప్లెక్స్ దగ్గరున్న ఐనాక్స్ లో ఫస్ట్ షో వదిలాక ఒక సీటులో దొరికిందండి సెల్ . రేపు మీరు వస్తే ఇచ్చేస్తాను."చెప్పింది.

        "మీ అడ్రస్ చెప్పండి" అడిగిందా ఆ గొంతు. ఆమె చిరునామా చెప్పాక ఆ గొంతు అంది.

        " సెల్ మీ దగ్గరే ఉంచండి. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చాక విజయవాడ బస్సు ఎక్కేసాను. రెండు రోజుల్లో తిరిగి వస్తాను. అప్పుడు ఫోన్ చేసి వచ్చి తీసుకుంటాను."

        " అలాగే " చెప్పి కాల్ కట్ చేసింది అమ్మాయి.

 # # #

        బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ దాటాక జనావాసాలకి దూరంగా ఉన్న డాబా ముందు ఆగింది పోలీస్ జీప్. ఇద్దరూ కానిస్టేబుల్స్ తో పాటు జీప్ దిగాడు ఇన్ స్పేక్టర్ సూరి. బాబా సమీపించి కాలింగ్ బెల్ నొక్కాడు. లోపల బెల్ మోగుతున్న శబ్దం బయటకు వినిపిస్తుంది. రెండుసార్లు నొక్కిన ఎవరు తలుపు తీయకపోవడంతో కాసేపు వెయిట్ చేసి అక్కడ నుంచి కదిలాడు.

        డాబా చుట్టు తిరిగి చూశాడు. డాబా వెనుక కిటికీ తెరిచి ఉంది. అది ఎనిమిది అడుగుల ఎత్తులో ఉండడంతో కానిస్టేబుల్ కు సైగ చేశాడు. పోలీస్ జీపు వచ్చి గోడపక్కన ఆగింది. జీపు పైకి కిటికీ నుంచి లోపలికి దిగాడు కానిస్టేబుల్.

        సూరి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చేసరికి కానిస్టేబుల్ లోపల నుంచి డోర్ తీశాడు. నేల మీద చూసుకుంటూ లోపలికి నడిచాడు సూరి. హాలు నీటుగా సర్ది ఉంది. టు బెడ్ రూమ్ డాబా అది. మొదటి బెడ్ రూమ్ సింగిల్ కాట్ తో ఖాళీగా ఉంది. రెండు బెడ్ రూమ్ వైపు అడుగులు వేసి గుమ్మంలో బొమ్మల నిలబడిపోయాడు.

        గదిలో డబుల్ కాట్ మీద ఒకామె ఆ చేతనంగా కనిపిస్తోంది. నిశితంగా చూస్తూ బెడ్ సమీపించాడు సూరి. ఆమె గుండెల్లోంచి దారిన రక్తం నైటీ మీద నల్లగా కనిపిస్తుంది. అంటే హత్య జరిగి ఆరేడు గంటలు దాటి ఉంటుంది. హత్యకి ఉపయోగించిన కత్తి మంచం పక్క ఎండిన రక్తంతో ఉంది.




        హంతకుడు కిటికీలోంచి లోపలికి ప్రవేశించి నిద్రపోతున్న ఆమెను హతమార్చాడు మెడ బోసిగా ఉంది. ఆమె అంతకుడిని ప్రతిఘటించిన చిహ్నాలు కనిపించడం లేదు. కత్తిపోటుకి బాధతో కొట్టుకోవడం వల్ల కాళ్లు చేతులు అస్తవ్యస్థంగా ఉన్నాయి.

        సూరి తన దృష్టి మృతురాలు మీద నుంచి మళ్లించి గదంతా చూశాడు గోడకి అమర్చిన టీవీ, మంచం పక్కన స్టూల్ మీద వాటర్ బాటిల్, టీవీ రిమోట్ తో పాటు ఏసి రిమోట్ ఉన్నాయి. ఏసి ఆఫ్ లో ఉంది. సీలింగ్ ఫ్యాన్ తిరగడం లేదు.

        నిద్రలో హత్య జరిగింది కాబట్టి రెండింటిలో ఒకటి పనిచేస్తూ ఉండాలి. ఎందుకంటే అది చలికాలం కాదు. హాలులోకి వచ్చాడు సూరి కప్ బోర్డులు మొత్తం తెరిచి ఉన్నాయి. వాటిలోని వస్తువులు చిందరవందరగా పడున్నాయి. దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు ఇంట్లోని మనుషులు ఎదురుగా తిరిగితే హత్య జరగడంలో అర్థముంది. కానీ బాత్రూం కిటికీ నుంచి లోపలికి వచ్చిన దొంగ బెడ్ రూమ్ కి బోల్టు పెట్టి తాపీగా దోచుకోవచ్చు. కానీ చూస్తుంటే ఆమెను చంపాక దొంగతనం చేశాడు.

        అప్పుడే క్లూస్ టిమ్ వచ్చి వేలిముద్రలు సేకరించే పనులు పడింది.

        ప్రతిరోజూ ఉదయం ఎనిమిదికి వచ్చే మని మనిషి ఎప్పటిలా కాలింగ్ బెల్ స్విచ్ నొక్కి తలుపు తీయ్యాకపోతే వెళ్ళిపోయింది. మిగతా ఇళ్లల్లో పనిచేశాక రెండోసారి వచ్చింది. తలుపు తీయకపోతే పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పింది. ఆ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. చూడ చక్కని జంట. భర్త బ్యాంకు ఆఫీసర్ అతను మీటింగ్ పనిమీద ఊరు వెళ్ళాడు. ఇంట్లో ఆమె ఒక్కతే ఉన్నప్పుడు జరిగింది హత్య.

        బ్యాంకు నుంచి హతురాలి భర్త నెంబర్ తీసుకుని కాల్ చేశాడు సూరి. కొన్ని గంటల్లో విశాఖపట్నం నుంచి వచ్చాడు భర్త. అతని ముఖం పీక్కుపోయి కనిపించింది. హఠాత్తుగా భార్య హత్యకు గురైతే తట్టుకోవడం అంత తేలిక కాదు. ఇంట్లోనే కొన్ని నగలు డబ్బు పోయాయని చెప్పాడు. అతను అలాగే హతురలి మెడలో హారం కూడా లేదు.

        "నిన్న ఉదయం రెండు రోజుల మీటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లాను. సాయంకాలం మీటింగ్ అయ్యాక కాల్ చేశాను. ఇవాళ రాత్రికి వస్తానని, ఆల్ఫా హోటల్ నుంచి బిర్యానీ తెస్తానని, డిన్నర్ ప్రిపేర్ చేయవద్దని చెప్పాను. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. నా భార్యని చంపిన వాడిని ఎలాగైనా పట్టుకోండి సార్!" ప్రాధేయపడ్డడతను.

        సూరి ఓకే అని కాదురాలి సెల్ నెంబర్ తీసుకొని అతన్ని పంపేశాడు. ఆ తర్వాత నెంబర్ కి కాల్ చేశాడు.

        "హలో..." అవతల నుంచి ఓ అమ్మాయి గొంతు వినిపించింది. ఈ ఫోన్ మీ దగ్గరకి ఎలా వచ్చింది ? అడిగాడు సూరి.

        " నిన్న సాయంకాలం ఐనాక్స్ థియేటర్లో ఫ్యామిలీతో ఫస్ట్ షో చూసామండి. ఒక సీటులో కనిపించింది ఈ ఫోన్. అప్పటికే జనం చాలా వరకు బయటకు వెళ్ళిపోయారు. ఫోన్ సొంతదారుడు కాల్ చేస్తే విషయం చెప్పి ఇచ్చేవచ్చని తెచ్చాను." చెప్పింది అమ్మాయి.

        "మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?"

        "విజయనగరం"

        "నేను చెప్పే వరకు సెల్ ఎవరికీ ఇవ్వకండి."

        "ఇంతకీ మీరు ఎవరు ?"

        "మీరు ఎవరు బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఇన్ స్పేక్టర్ని.

        నా పేరు సూరి. "చెప్పి కాల్ కట్ చేశాడు.

        ఫోన్ ఉపయోగించే అమ్మాయి బొబ్బిలిలో హత్య చేయబడింది. ఆమె సెల్ విజయనగరంలో ఐనాక్స్ థియేటర్లో దొరికింది. భర్త మీటింగ్ కోసం విశాఖపట్నం వెళ్ళాడు.

        సూరి బుర్ర వేడెక్కింది.

# # #

        రమ్యతో నూడేళ్ల క్రితం పెళ్లయింది ప్రభాస్ కి. బొబ్బిలిలో పోస్టింగ్ వచ్చాక ఇల్లు కొన్నాడతను. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఎంతో జాగ్రత్తగా దర్యాప్తు చేసిన రమ్య హత్యకి కారణం కనిపించలేదు. ఇంట్లో భార్యాభర్తలతో పాటు పనిమనిషి వేలిముద్రలు మాత్రమే ఉన్నాయి. ఇంతవరకు రకరకాల కథనాలతో వార్తలు రాసిన పేపర్లు టీవీ ఛానళ్లు మౌనం వహించాయి. ఈ కేసు విషయంలో పోలీసులు చేతులు ఎత్తేసారని ప్రజలు నిర్ణయానికి వచ్చారు.

        ఆ సమయంలో జరిగిందాఆ సంఘటన.

"హత్య జరిగి పది రోజులు అయింది. ఇంతవరకు మీరు అంతకున్ని పట్టుకోలేదు."

స్టేషన్ కి వచ్చి ఇన్ స్పేక్టర్ ముందు కూర్చుంటూ అన్నాడు ప్రభాస్.

" ఆ విషయం మాట్లాడడానికి మిమ్మల్ని రమ్మన్నాను"..... చెప్పాడు సూరి.

" నా రమ్యని హత్యచేసిన వాడిని ఉరి తియ్యాలి. అప్పుడే నాకు శాంతి." విసురుగా అన్నాడు ప్రభాస్. చిన్నగా నవ్వాడు సూరి.

"మీలాగే నాకూ హంతకుని మీద కోపం ఉంది. చీమకు కూడా అపకారం చేయని రమ్యని చంపడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయో. నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. మీరు తీర్చాలి....." అని ప్రభాస్ కళ్ళల్లోకి చూశాడు సూరి.

" అడగండి "

" హత్య జరిగిన రోజు రాత్రి మీరు విశాఖపట్నంలో ఉన్నారు. రెండు రోజుల మీటింగ్ కాబట్టి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర లాడ్జిలో రూమ్ తీసుకున్నారు."

"అవును.... ఈ విషయం మీకు ముందే చెప్పాను." ప్రభాస్ అన్నాడు.

  "మొదటి రోజు మీటింగ్ అయ్యాక మీరు రూమ్ కి మందు తెప్పించుకున్నారు. బయట ఊర్లకి వెళ్ళినప్పుడు రాత్రి నిద్రపోయే ముందు రమ్యతో మాట్లాడటం మీకు అలవాటు."

  "ఒంటరిగా ఉన్నప్పుడు మందు తీసుకుంటాను. ఈ సంగతి రమ్య కి తెలియదు." చెప్పాడతను.

  "నీ అలవాటు ప్రకారం మందు తాగాక రాత్రి 10 గంటల 10 నిమిషాలకి రమ్య కి కాల్ చేశావు. రమ్య బదులు మరొకామె కాల్ రిసీవ్ చేసుకుంది. విజయనగరం ఐనాక్స్ థియేటర్లో సెల్ దొరికిందని చెప్పింది. బొబ్బిలిలో ఉండాల్సిన రమ్య విజయనగరం ఐనాక్స్ థియేటర్ కి ఎందుకు వెళ్ళిందని సందేహం వచ్చింది నీకు. తరచుగా ఇంటికి వచ్చి రమ్యతో చనువుగా ఉండే నీ కొలీగ్ మీద అనుమానం కలిగింది. వెంటనే అతనికి కాల్ చేశావు ముందు గదిలో సెల్ చార్జింగ్ పెట్టి బెడ్ రూమ్ లో నిద్రపోవడం వల్ల రిసీవ్ చేసుకోలేదు. దానితో నీ అనుమానం బలపడింది."

  " మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి...."అరిచాడు ప్రభాస్.

  " కూల్ డౌన్ మిస్టర్ ప్రభాస్..... నేను చెబుతున్న ప్రతి దానికి సాక్షం ఉంది. నువ్వు వెంటనే లాడ్జి పక్కనే ఉన్నా పెట్రోల్ బంకులో రెండువేల రూపాయిల పెట్రోల్ పోయించుకున్నావు. విశాఖపట్టణం నుండి బొబ్బిలి నూటపది కిలోమీటర్లే కాబట్టి రెండు గంటల్లో బొబ్బిలి చేరావు. ఇంటి వెనక కిటికీ బోల్టు పడదని నీకు తెలుసు కాబట్టి కారు అక్కడ ఆపావు. కారు పైకెక్కి కిటికీలోంచి లోపలికి ప్రవేశించావు. వంటగదిలోని కత్తి తీసుకుని రమ్మిని చంపి తిరిగి విశాఖపట్నం వెళ్ళిపోయావు." చెప్పడం ముగించాడు సూరి.

  ప్రభాస్ దిగ్ర్భంతిగా చూసాడు.

  " పెట్రోలు బంకులో పెట్రోల్ పోయించుకున్నట్లు సీసీ కెమెరాలు రికార్డు అయింది. రెండువేల రూపాయలు పెట్రోల్ బిల్ క్రెడిట్ కార్డుతో చెల్లించావు. పదిగంటల పది నిమిషాలకు రమ్య కి కాల్ చేసినట్టు నీ సెల్ కాల్ డేటా లో ఉంది. అలాగే నీ కోలీగ్ కి కాల్ చేసినట్టు కూడా ఉంది. ఇంటి వెనక కిటికీ బోల్టు సరిగ్గా లేదని బయట వాళ్లకి తెలిసే అవకాశం లేదు. అలాగే హత్య చేశాక కరెంటు దండగని ఫ్యాన్ స్విచ్ ఆపేసావు. ఇదంతా చేసిన నీకు ఓ నిజం తెలియదు." ఆగాడు సూరి.

  కత్తి వాటుకి నెత్తురు చుక్కలేనట్టు పాలిపోయిన ముఖాన్ని పెకెత్తడు ప్రభాస్.

  "పార్వతీపురం లో ఉంటున్న స్నేహితురాలు పిలిస్తే నగలు కొనడానికి ఆమెతో రమ్య వెళ్లిందని, అక్కడ పని ముగిసిన ఇద్దరూ సినిమాకి వెళ్లారని, ధియేటర్లో రమ్య తను సెల్ మర్చిపోయిందని నీకు తెలియదు." చెప్పి , డ్రాయర్ లోంచి చిన్న గుడ్డ మూట తీసి టేబుల్ మీద పెట్టాడు.

  "ఇవి రమ్య నగలు, వాటిలో ఆమె మంగళసూత్రం కూడా ఉంది. నీ కారు డాష్ బోర్డులో దొరికాయి. తాగిన మైకంలో బుద్ది పక్కదారి పట్టి నీ అందమైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నావు." బాధగా అన్నాడు సూరి.

  రెండు చేతులతో ముఖం కప్పుకుని రోడించసాగడు ప్రభాస్.

  ఆ రోదన స్టేషన్ గోడలను తాకి ప్రతిధ్వనిస్తుంది.

  # క్షణికావేశంలో చేసే తప్పులు వల్ల జీవితాలు చాలా నాశనం అయిపోతాయి అందుకని ఏదైనా పని చేసే ముందు కొంచెం ముందు వెనక ఆలోచించమని పెద్దలు చెబుతారు. #


Story written by manjari garu

Post a Comment

0 Comments

Close Menu
#copy peste code #copy peste code