Mangli Bathukamma song Lyrics 2022 | Full Song | Goreti Venkanna | Indravathi Chauhan | Madeen | Janulyri Lyrics - Mangli & Indravathi Chauhan
Singer | Mangli & Indravathi Chauhan |
Composer | Madeen SK |
Music | Madeen SK |
Song Writer | Goreti Venkanna |
Lyrics
ఓ....ఓ....ఓ....ఓ....
ఓ....ఓ....ఓ....ఓ.....
ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి
దూసి తెచ్చి
తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి
పచ్చి తంగెడుతో గుమ్మాడీ పూలు చేర్చి...
బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి...
బంగారు బతుకమ్మను ఇంటిలొ పేర్చి
ఆడబిడ్డల అరచేతులనే ఊయల కట్టి
వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి...
పువ్వులనే పూజించే పండుగ తెచ్చె
ఆ.. నీటి మీద నిలిచి..
తామరలు కళ్ళు తెరిచే
ఏటిగట్టు మీద..
పూలెన్నో నిన్ను పిలిచె..
అందాల బతుకమ్మా రావె..
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే..వటే
పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే
పత్తి పువ్వులు నీ.. పెదవుల నవ్వులుగా
గునుగు పువ్వులు నీ.. గుండె సవ్వడిగా
కంది పువ్వులనే కంటి పాపలుగా..
సీతాజడ పూలే నీలో సిగ్గులుగా..
తీరొక్క పూలు చేరి.. నీ చీరలాగ మారి
ఆ.. ఆడబిడ్డలాగ
నిను తీర్చిదిద్దుతుంటే
దారుల్లో ఊరేగ రావే...
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే..వటే
పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే
ఆ.. మెట్టినిల్లు వీడి చెల్లి..
పుట్టినిల్లు చేరే వేళ
పట్టరాని ఆనందాలే
పల్లెటూరు కోచ్చేనంట..
పట్టణాలు వీడి జనం..
సొంతవూరు చేరే క్షణం
చిన్నబోయి ఉన్న గ్రామం..
సందడిగా మారే దినం...
బ్రతుకు పండుగలో..
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే..వటే
ఓ....ఓ....ఓ....ఓ....
ఓ....ఓ....ఓ....ఓ.....
పూవుల జాబిలివే పున్నమి వాకిలివే
చీకటికే రంగులు పులిమావే
ఆడపడుచులు నీ కన్న తల్లులయి
పున్నమి రాతిరిలో జోలలు పాడుదురే
ఆట కోయిలలే నీ అన్నదమ్ములయి
కంటికి రెప్పవలె నిన్ను.. కాపాడుదురే
ఏ తల్లి కడుపులోన నువ్వు పొందలేదే జన్మ
ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ
జన్మ జన్మాల బందానివి నీవై..
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే..వటే
గావురంగ..పెరిగినీవు...
గడపలు దాటుతుంటే
మళ్ళీరా తల్లి అంటూ..
కళ్ళ నీల్లారగించి
చెరువుని చేరుకొని
తల్లి నిన్ను సాగనంప
చివరి పాటలతో
నీటనిన్ను దోలుతుంటే
చెమ్మగిల్లేను కళ్ళే...
తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి
లోకమంతా తిరిగే..వటే
పాలసంద్రం పూలే..పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే..నే
పువ్వుల జాతరవే
జమ్మీ పండుగవే
పాలపిట్టొలె మళ్ళిరావె...
Special Thanks to
Sri Adi Maha Vishnu Devasthanam D.Nagaram, Choutuppal
0 Comments