విల్లిస్కా యాక్స్ మర్డర్స్ హౌస్
కటిక చీకటిని చీల్చుకుంటూ పుట్టే అలికిడి. ఎంతటి వారినైనా వణికిస్తుంది. ఎన్ని
కథనాలనైనా పుట్టిస్తుంది. ప్రశాంతమైన జీవితాలకు ఆ చీకటే ముగింపు అయితే? ఆ అలికిడే మృత్యువైతే..?
సరిగ్గా నూటపదేళ్ల క్రితం.. యునైటెడ్ స్టేట్స్లోని ఐయోవాలో అదే జరిగింది. విల్లిస్కా
పట్టణంలోని ఓ ఇల్లు.. అంతులేని విషాదాన్ని.. ప్రపంచానికి ఓ మిస్టరీగా పరిచయం చేసింది.
1912, జూన్ 9 రాత్రి పదిన్నర తర్వాత ఆ ఇంట్లో అంతా నిద్రపోయారు. కొన్ని గంటల
వ్యవధిలోనే ఓ నీడ మెట్ల మీద నుంచి పైనున్న మాస్టర్ బెడ్రూమ్ వైపు కదిలింది. ఆ నీడ చేతుల్లో
ఉన్మాదంతో లేచిన గొడ్డలి.. మొదటిగా ఆ ఇంటి పెద్ద.. జోసియా మూర్ (43) తలపై బలమైన వేటును
వేసింది. క్షణాల్లో ఆ పక్కనే గాఢనిద్రలో ఉన్న అతడి భార్య సారా (39) ఉసురు కూడా తీసేసింది.
రక్తపు ధారలతో ఆ గొడ్డలి.. పిల్లల గదిలోకీ అడుగుపెట్టింది. పదకొండేళ్ల హెర్మన్ మాంట్లొమెరీ,
పదేళ్ల మేరీ కాథరిన్, ఏడేళ్ల ఆర్థర్ బోయిడ్, ఐడేళ్ల పాల్ వెర్నాన్.. రెప్పపాటు కాలంలో
ఎవరి మంచం మీద వారే విగత జీవులైపోయారు. పిల్లల మృత్యుఘోషను చెవులారా విని.. నిశ్శబ్దంగా
వారి రక్తపు మగుడుల్ని తొక్కుకుంటూ మళ్లీ జోసియా రూమ్లోకి వెళ్లిందా నీడ. ప్రాణాలతో
లేని జోసియా తలను మళ్లీ పదేపదే కసితీరా నరికింది. కాసేపటికి.. కింద గెస్టూమ్లో నిద్రిస్తున్న
మేరీ కాథరిన్ స్నేహితుల మీదా వికృతంగా విరుచుకుపడింది. ఆ దాష్టీకానికి.. అక్కాచెల్లెళ్లైన
ఎనిమిదేళ్ల ఇనా స్టిలింగర్, పన్నెండేళ్ల లీనా జోసియా తలను మళ్లీ పదేపదే కసితీరా నరికింది.
కాసేపటికి.. కింద గెస్టూమ్లో నిద్రిస్తున్న మేరీ కాథరిన్ స్నేహితుల మీదా వికృతంగా విరుచుకుపడింది.
ఆ దాష్టీకానికి.. అక్కాచెల్లెళ్లైన ఎనిమిదేళ్ల ఇనా స్టిలింగర్, పన్నెండేళ్ల లీనా స్టిలింగర్
కథ కూడా ఆ ఇంట్లోనే ముగిసిపోయింది. ఏ జీవితాల్లో ఏ అలజడలు రేగినా.. కదిలే కాలం క్షణం
కూడా ఆగదు. తెల్లవారింది. ఎప్పుడూ ఐదు కాకుండానే నిద్రలేచే సారా.. ఏడు దాటినా బయటికి
రాకపోయేసరికి.. ఇరుగు పొరుగువారికి అనుమానం వచ్చింది. ముందు తలుపుకొట్టారు. తర్వాత
లోపల నుంచి వేసుకున్న తాళం పగలగొట్టారు. గెస్ట్ రూమ్ లో ఇనా, లీనా శవాలను చూసి షాక్
అయిన పొరుగింటి వారికి.. ఆ పక్కనే గోడకు జారేసిన గొడ్డలి కనిపించింది. వెంటనే పోలీసు
స్టేషన్కి పరుగుతీశారు.
ఫోటో పెట్టాలి
మొత్తం ఎనిమిది హత్యలు.. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య కాలంలో
జరిగాయని వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో కదలాడిన రక్తపు షూ మార్క్స్.. పైన చెప్పుకున్నట్లు..
ఎవరి తర్వాత ఎవరి మరణించారో చెప్పగలిగాయంతే. ఇంట్లో అద్దాలన్నీ కప్పి ఉన్నాయి. కిటికీ
కర్టెన్స్, తలుపులు అన్నీ మూసే ఉన్నాయి. శవాల ముఖాలు కూడా దుప్పట్లలో దాచిపెట్టి ఉన్నాయి.
లీనా స్టిలింగర్ మినహా మిగిలిన బాధితులంతా నిద్రలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారని తేలింది.
లీనా.. చేతులకు గాయాలు ఉండడంతో ఆత్మరక్షణార్థం పెనుగులాడిందని స్పష్టమైంది. మనుషులపై
పడిన గొడ్డలి వేటుల లెక్కలు తేల్చారు కానీ.. జోషియా బెడ్రూమ్ గోడపైన పడిన గొడ్డలి వేటుని
ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే.. ఆ రూమ్ లో జోషియా, సారా ఇద్దరూ నిద్రలోనే ప్రాణాలు
విడిచారు. ఆ రూమ్లో కిల్లర్కి ఎదురు తిరిగినవారే లేరు. కానీ గోడపై గొడ్డలి వేటు ఎందుకు
పడిందనేది ఎవరికీ అర్థం కాలేదు. కిచెన్లో ఎరుపు నీళ్లు.. కిల్లర్ చేతులు కడుక్కున్నాడన్న
ఆధారాన్ని చూపాయి. ఎక్కడా వేలి ముద్రలు దొరకలేదు. హత్యకు వాడిన గొడ్డలి జోషియా ఇంట్లోదే
కావడం విచిత్రం. జూన్ 9 సాయంత్రం.. మూర్ కుటుంబం..
ప్రెస్బిటేరియన్ చర్చిలో జరిగిన చిల్డ్రన్స్ డే కార్యక్రమానికి హాజరైంది. అప్పుడే
మేరీ కాథరిన్.. తన స్నేహితులైన ఇనా, లీనాలను సరదాగా తన ఇంటికి ఆహ్వానించింది. రాత్రి
తొమ్మిదిన్నర అయ్యేసరికి.. అంతా చర్చ్ నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు ఇనా, లీనాలు
ఆ ఇంటికి రాకున్నా ప్రాణాలతో మిగిలేవారనేది కొందరి అభిప్రాయం. అసలు ప్రమాదమే వాళ్ల
రూపంలో వచ్చి ఉంటుందనేది మరికొందరి వాదన. లీనా చనిపోయేముందు లైంగిక వేధింపులకు గురైందన్న
ఆధారాలే ఆ వాదనకు కారణం. మూర్ ఫ్యామిలీ ఇంటికి చేరేటప్పటికే కిల్లర్ ఇంటి అటకమీద నక్కి
ఉన్నాడనేది. డిటెక్టివ్ ల నమ్మకం. విచారణలో చాలా మంది అనుమానితుల్ని ప్రశ్నించారు పోలీసులు.
మొదటి అనుమానితుడు.. జార్జ్ కెల్లీ అనే యువకుడు. అతడిపై లైంగిక ఆరోపణలు చాలా ఉన్నాయి.
అతడు జూన్ 9న మూర్ కుటుంబం హాజరైన చిల్డ్రన్స్ డే కార్యక్రమానికి బోధకుడిగా వచ్చాడు.
మరునాడు ఉదయం 5:50కి విల్లిస్కా పట్టణాన్ని వదిలి వెళ్లాడు. ఆ ఆధారాలతోనే పోలీసులు
అతడ్ని నిలదీశారు. అయితే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడనే కారణంతో కోర్టు అతడ్ని నిర్దోషిగా
విడుదల చేసింది. మరో అనుమానితుడు స్థానికుడైన ఫ్రాంక్ జోన్స్. జోషియా మొదట అతడి దుకాణంలోనే
పనిచేశాడు. కాలక్రమేణా జోషియా తన తెలివితేటలతో.. డీలర్షిప్తో సహా జోన్స్ వ్యాపారాన్ని
చేజెక్కించుకున్నాడు. పైగా జోన్స్ కోడలితో జోషియాకి లైంగిక సంబంధం ఉందనే పుకార్లు..
జోన్సిని నిందితుడ్ని చేశాయి. ఆ క్రమంలోనే జోన్ని విచారించి.. ఫలితం లేక వదిలిపెట్టారు.
అయితే ఓ సీరియల్ కిల్లర్.. ఆ చుట్టుపక్కల కొంతకాలంగా గొడ్డలి హత్యలు చేయడంతో అతడే ఈ
నేరాలు చేశాడా? లేక అతడి ఖాతాలోకి పోవాలని ఇంకెవరైనా ఇలా చేశారా? అనేది నేటికీ తేలలేదు.
మొత్తానికీ ఈ కథ.. 2020 జనవరి 15న కొత్త మలుపు తిరిగింది. అమెరికాలో ప్రత్యేక
గుర్తింపు పొందిన ఘోస్ట్ అడ్వెంచర్స్ టీమ్.. 'పారానార్మల్ రియాలిటీ టెలివిజన్ సిరీస్'లో
భాగంగా స్పిరిట్ బాక్స్ (ఆత్మలను పట్టుకోగల సాధనం)ను తీసుకుని.. మూర్ ఇంటికి వెళ్లింది.
అక్కడున్న ఆత్మల మాటలను ప్రేక్షకులకు వినిపించింది. ఈ కేసుకు సంబంధించిన వరుస ఎపిసోడ్స్..
ఈ హత్యలన్నీ ఆ ఇంట్లోని ఘోస్ట్ చేసిందని చూపించాయి. అప్పటికే హారర్ ప్రియుల్ని వణికించిన
'ది యాక్స్ మర్డర్స్ ఆఫ్ విల్లిస్కా' సినిమా.. ఆ కథనాలను బలపరచింది. దాంతో ఈ ఘాతుకానికి
పాల్పడింది దెయ్యమా? అంతకంటే క్రూరమైన మనిషా? అనేది మిస్టరీగా మారింది.
0 Comments